ఉయ్యూరు, మార్చి 1 : అరాచక, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభు త్వం అధోగతిపాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెద ఓగిరాలలో బుధవారం ఇంటింట ప్రచారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచ కాలు, అవినీతి, ధరల పెరుగుదలను పార్టీ నాయకుడు పోతిరెడ్డి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసేవారిపై అక్రమ కేసులు పెట్టి అణిచివేయటం పరిపాటైంద ని విమర్శించారు.