• Mobile No : 88856 18111

Author: admin

Ayodhya: అయోధ్యలో మసీదు నిర్మాణం త్వరలోనే…

అయోధ్య: అయోధ్య (Ayodhya)లోని ధనీపూర్ (Dhannipur) గ్రామంలో మసీదు (Mosque) నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో జరుగనున్న అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ (ADA) సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ పౌండేషన్ (IICF) ట్రస్టు ప్రతినిధి ఒకరు బుధవారంనాడు తెలిపారు. తొలుత స్థలం వేరేచోట కేటాయించడంలో జరిగిన జాప్యం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మరికొంత జాప్యం జరిగిందని చెప్పారు. ధనీపూర్ ప్రాజెక్టు పర్యవేక్షణ […]

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న వైసీపీ

ఉయ్యూరు, మార్చి 1 : అరాచక, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభు త్వం అధోగతిపాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెద ఓగిరాలలో బుధవారం ఇంటింట ప్రచారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచ కాలు, అవినీతి, ధరల పెరుగుదలను పార్టీ నాయకుడు పోతిరెడ్డి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసేవారిపై అక్రమ కేసులు పెట్టి అణిచివేయటం పరిపాటైంద ని విమర్శించారు.

బండ బాదుడు

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సామాన్యుల నడ్డివిరిగేలా కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్‌ బండ ధర పెంచింది. ‘అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పు’ అనే విధానంతో ఎప్పటికప్పుడు రేటు పెంచుతోంది. తాజాగా మరోసారి 14.5 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచింది. ప్రస్తుతం విశాఖపట్నంలో వంట గ్యాస్‌ ధర రూ.1,061గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధర రూ.1,111తో పంపిణీ చేయడం ప్రారంభించారు. గతంలో రూ.900 సిలిండర్‌ ధర వున్నప్పుడు రూ.400 వరకు రాయితీ […]

రేపటి నుంచి పెట్టుబడుల సదస్సు

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఇందుకోసం నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. రాత్రింబవళ్లు ఫుట్‌పాత్‌లకు రంగులేస్తూ, విద్యుద్దీపాలు అమరుస్తూ కూలీలు శ్రమిస్తూనే ఉన్నారు. మైదానంలో కూడా ఏర్పాట్లు పూర్తికాలేదు. ఇంకా 30 శాతం పనులు మిగిలే ఉన్నాయి. జర్మన్‌ హ్యాంగర్ల నిర్మాణం, ప్రవేశ ద్వారాల ఏర్పాటు పూర్తికాగా వేదికల నిర్మాణం, హోర్డింగ్‌ల ఏర్పాటు పనులు ఇంకా సాగుతున్నాయి. అవి పూర్తయిన తరువాత […]

విశాఖ ఉక్కు దివాలా!?

కుక్కను చంపడానికి.. పిచ్చిదన్న ముద్ర ఎలాగైతే వేస్తారో.. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ కేంద్రం ఇదే పద్ధతి పాటిస్తోంది. ఏ దశలోనూ చేయూతనివ్వకుండా అడుగడుగునా దానిని నష్టాల పాల్జేస్తూ.. దివాలా దిశగా నడిపిస్తోంది. అస్మదీయ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకే నాటకమాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌).. అంటే విశాఖ ఉక్కు కర్మాగారం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో తెలుగువారి ఉద్యమ ఫలితంగా ఏర్పడిందీ సంస్థ. పుట్టినప్పటి నుంచీ […]

రుషికొండపై జగన్‌ కన్నేశారు

న్యూఢిల్లీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలకు ముందు… మీకు కూలివాడిలాగా పనిచేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి’ అని బతిమాలిన వ్యక్తులు, ఇప్పుడు రాచరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏప్రిల్‌ నుంచి విశాఖ రాజధాని గా సీఎం జగన్‌ పరిపాలిస్తారని సుబ్బారెడ్డి చెబుతున్నారని, ఎవరికి వారే రాజులమని అనుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. విశాఖలో రుషికొం డ నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, భవనాల పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెప్పారు. […]

మళ్లీ దరఖాస్తుల పరిశీలన

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకొన్న వారందరి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు పరిశీలించనుంది. అయితే 2022 మార్చి నాటి మార్కెట్‌ విలువలే (రిజిస్ట్రేషన్‌ వాల్యూ) ప్రామాణికంగా క్రమబద్ధీకరణ రుసుం తీసుకోనున్నారు. దీంతో దరఖాస్తుదారులకు రుసుం భారీగా పెరిగే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణ కోసం జీవో నంబరు 59 కింద దరఖాస్తులు చేసుకొనేందుకు ప్రభుత్వం విధించిన కటాఫ్‌ తేదీని ఎత్తివేస్తూ చీఫ్‌ […]

నేత్రపర్వంగా దివ్యవిమాన రథోత్సవం

యాదగిరిగుట్ట, మార్చి 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వెండి గరుడ సేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం నేత్రపర్వంగా సాగాయి. ప్రత్యేక పూజల అనంతరం వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో స్వామివారి దివ్య విమానరథాన్ని అలంకరించారు. పట్టువస్త్రాలు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలతో నూతన కల్యాణ దంపతులైన లక్ష్మీనారసింహులను అలంకరించి ప్రత్యేకసేవలో తీర్చిదిద్దారు. దివ్యవిమాన రథంపై అధిష్ఠింపజేశారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో మంగళవాయిద్యాలు.. మేళతాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. […]

మెస్‌ బిల్లులు 25% పెంపు?

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల మెస్‌ (డైట్‌) బిల్లుల పెంపునకు రంగం సిద్ధమైంది. మెస్‌ బిల్లులను 25 శాతం మేర పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు ఓ నివేదికను పంపింది. ఆ ప్రతిపాదనలకు సీఎం ఆమోదముద్ర పడితే కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో చివరిగా రాష్ట్రంలో మెస్‌ చార్జీలను పెంచారు. పెరిగిన […]

KTR : మహిళా దినోత్సవాన మోదీ కానుక ఇదేనా?

హైదరాబాద్‌, హిమాయత్‌ నగర్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు మండిపడ్డారు. మహిళా దినోత్సవాన దేశంలోని ఆడబిడ్డలకు ప్రధాని మోదీ ఇచ్చిన కానుక ఇదేనా అని ప్రశ్నించారు. సిలిండర్‌ ధర పెంపు నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మోదీ సర్కారు రాకముందు రూ.400గా ఉన్న గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.1150కి పెరిగిందని, ఇప్పుడు పెంచిన రూ.50తో కలిపి రూ.1200కి చేరుకుందని అన్నారు. ఈ […]