న్యూఢిల్లీ, మార్చి 1: జోడో యాత్ర జరిగినన్ని రోజులు క్షవరం చేసుకోకుండా, గడ్డం తీసుకోకుండా ఉన్న కాంగ్రె్‌సనేత రాహుల్ తాజాగా ట్రిమ్మింగ్, కటింగ్ చేయించుకున్నారు. యూకేలోని కేంబ్రిడ్జి వర్సిటీలో ప్రసంగించాలని ఆహ్వానం అందిన నేపథ్యంలో ఆయన కొత్త, స్టైలిష్ లుక్‌లోకి మారారు. ‘లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజా స్వామిక వాతావరణాన్ని పెంపొందించేం దుకు కొత్త ఆలోచనా విధానం అవసరమని ఆయన అన్నారు. భారత్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇటీవలి కాలంలో ఉత్పత్తి కార్యకలాపాలు తగ్గిందన్నారు. ప్రస్తుతం తయారీ అంతా చైనాలో జరుగుతోంది అని చెప్పారు.